నరసరావుపేటలో వైభవంగా కుంకుమ పూజ కార్యక్రమం
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 17వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆలయంలో నిర్వహించిన కుంకుమ పూజలు 13వ అదనపు జిల్లా జడ్జి సత్య శ్రీ పాల్గొని కుంకుమ పూజ చేశారు. అనంతరం అమ్మవారి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు జిల్లా జడ్జి సత్య శ్రీ అమ్మవారి ప్రసాదం అందజేశారు.