ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, కుమార్, జాన్సన్, కళావతి, విజయజ్యోతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.