ఈతముక్కలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ
Ongole Urban, Prakasam | Jul 10, 2025
విద్యార్థుల సంపూర్ణ వికాసం, సంస్కారం దిశగా విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బోలోపేతం చేస్తున్నట్లు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. గురువారం కొత్తపట్నం మండలం ఈతముక్కలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరస్వతి విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటి, పేరెంట్ - స్టూడెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింటులో ఆయన సెల్ఫీ దిగారు.