నంద్యాల అర్బన్: నంద్యాల ట్రాఫిక్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి: నంద్యాల ఏఐటియుసి కార్యదర్శి ధనుంజయుడు
Nandyal Urban, Nandyal | May 9, 2026
నంద్యాల ట్రాఫిక్ సీఐ చాంద్ బాషాను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి ధనుంజయుడు డిమాండ్ చేశారు. శనివారం నంద్యాలలోని సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికులు, వీధి వ్యాపారులపై సీఐ దాడులు చేస్తూ అరాచకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. తోపుడు బండ్లు, టిఫిన్ బండ్ల వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని అన్నారు