నంద్యాల అర్బన్: బాల్య వివాహాలతో బాలికలకు అనారోగ్యం : నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాములు
Nandyal Urban, Nandyal | Apr 19, 2026
బాల్య వివాహాల వల్ల బాలికలు తీవ్ర అనారోగ్యం పాలవుతారని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాములు పేర్కొన్నారు. గోస్పాడు కస్తూర్బా పాఠశాలలో బాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు జరిగితే 1930కి సమాచారం అందించాలన్నారు. పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ కలిగి ఉండాలని నంద్యాల శక్తి టీం సభ్యులు పేర్కొన్నారు.