బండారులంకలో డైలీ మార్కెట్‌ను ఆధునీకరిస్తామని స్థానిక నేతలకు హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్
మంత్రి పినిపే విశ్వరూప్ బండారులంకలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైలీ మార్కెట్లో గత ప్రభుత్వంలో నిర్మించిన దుకాణ సముదాయం అసంపూర్తిగా వదిలేయడంతో శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని పునర్నిర్మించి రోడ్డుకు దగ్గరగా మరో 6 నూతన దుకాణాలు నిర్మిస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన జగదీశ్ చంద్ర గణేశ్ స్థానిక నేతలతో కలిసి కోరడంతో మంత్రి మార్కెట్‌ను పరిశీలించారు.