తుఫాన్ ప్రభావంతో అగమ్య గోచరంగా మారిన మొక్కజొన్న రైతుల పరిస్థితి
తుఫాన్ ప్రభావంతో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాలకు తోడు మళ్ళీ తుఫాను మొదలవడంతో మొక్కజొన్నలు ఆరక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నార. మొక్కజొన్న కోసి వారం పది రోజులు అవుతున్న ఆరక, ఆరిన గింజలు వ్యాపారస్తులు తక్కువ రేటుకు కొనుగోలు చేసుకోవడంతో,రైతుల పరిస్థితి చాలా ఘోరంగా మారింది. మొక్కజొన్నలు తడుస్తుండడంతో వాటిని తడవకుండా జప్పుకునేందుకు నాన్న తంటాలు పడుతున్నారు రైతులు.