డోన్: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈనెల ఐదున రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో బంద్: డోన్ లో ఏబీవీపీ నేత రవికుమార్
Dhone, Nandyal | Aug 3, 2026 విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డోన్ ఏబీవీపీ నేత రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, జీఓ 77ను రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసి ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు పిలుపు నిచ్చారు