ఒంగోలు అర్బన్: దొనకొండ ఇండస్ట్రియల్ హబ్ గురించి మీడియాకు వివరాలను తెలియజేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 10, 2026
ప్రకాశం జిల్లాలోని దొనకొండలో 25వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ హబ్బును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ రాజాబాబు దొనకొండ తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు బుధవారం స్థానికంగా ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ కేటాయించినటువంటి పలు భూములను పరిశీలన చేసిన ఆయన అనంతరం మీడియాకు వివరాలను తెలియజేశారు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అనేక కంపెనీలు ముందుకు వచ్చాయని త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి ఇండస్ట్రీలో ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు తెలియజేశారు త్వరలో దొనకొండను పారిశ్రామిక హబ్ గా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు