డోన్: డోన్ లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను సీసీ కెమెరా ల ఆధారంగా గుర్తించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Dhone, Nandyal | May 26, 2026 డోన్ పూల మార్కెట్లో ఆదివారంఅర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు హల్చల్ చేశారు. పలు దుకాణాల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు.. విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఉదయం విషయం గుర్తించిన వ్యాపారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలికి చేరుకొని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.