పుంగనూరు: భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి పరిస్థితి విషమం. ల
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం మేలుపట్ల సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎదురు ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో కాటిపేరి గ్రామానికి చెందిన గంగప్ప 60 సంవత్సరాలు గాయపడ్డారు వెంటనే స్థానికులు గంగప్పను ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహించి గంగప్ప పరిస్థితి విషమించడంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి సిఫారిసు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.