బాల్కొండ: మోర్తాడుకు చెందిన కాముని పద్మాఅనే వృద్ధురాలు అదృశ్యం
మోర్తాడ్ గ్రామానికి చెందిన కామని పద్మా (66) కనిపించడం లేదని ఎస్సై రాము తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మానసిక పరిస్థితి సరిగా లేని పద్మావతి మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె భర్త కామని పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు