ఒంగోలు అర్బన్: ఇకనుంచి పని దినాలు 125 రోజులుగా ఉపాధి హామీ పథకాన్ని మార్చడం జరిగిందని కలెక్టర్ రాజాబాబు వెల్లడి
Ongole Urban, Prakasam | Jul 2, 2026
గతంలో వంద రోజులు ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నేడు 125 రోజులకు మార్చడం జరిగిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు గురువారం తెలిపారు. జరుగుమల్లి, మర్రిపూడి మండలాలలో విబీజీ రామ్ జి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి స్వామితో పాటు కలెక్టర్ పాల్గొన్నారు. గతంలో ఉపాధి హామీ పేరుతో ఉన్న ఈ పథకానికి పేరు మార్చడం జరిగిందని ఇక మీదట ప్రతి ఒక్కరు ఈ పేరుతో పిలవడం మంచిదని తెలిపారు. గతంలో కరువు పని అని కొన్ని ప్రాంతాలలో అనేవారని ఇప్పుడు ఎక్కడ కూడా కరువు అనేది లేదని కలెక్టర్ తెలిపారు.