ఒంగోలు అర్బన్: ఒంగోలు మంగమూరులో యువకుడు దారుణ హత్య, ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలోని మంగమూరులో అశోక్ అనే యువకుడిని స్నేహితులే హత్య చేశారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అనుమానితుడిని తమకు అప్పగించాలని మృతుడి బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని మృతుడి బంధువులకు తెలిపారు. యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.