కులస్తుల సమస్యల పరిష్కారానికి సమిష్టి పోరాటమే మార్గం: కురుమ, కురబ, కురవ సంఘ నాయకులు
కురుమ, కురబ, కురవ సంఘం పదో వార్షికోత్సవం అక్టోబర్ 12న విజయవాడలో జరగనుంది. కనకదుర్గ వారధి సమీపంలోని CSR కళ్యాణ మండపంలో జరిగే ఈ సభకు రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో కులస్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమిష్టి పోరాటాల ద్వారానే కులస్తుల సమస్యలు పరిష్కారం అవుతాయని, రాబోయే ఎన్నికల్లో జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ స్థానాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు.