జుక్కల్: గల్లంతైన మొగులయ్య శవం లభ్యం : ఎస్సై శివకుమార్
జుక్కల్ నియోజవర్గం నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నీరుడి మొగులయ్య (36) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. బుధవారం సాయంత్రం గ్రామ శివారులోని జానకికుంటలో స్నానానికి వెళ్లి మొగులయ్య గల్లంతయ్యాడని, శుక్రవారం ఉదయం గజ ఈత గాళ్ళతో మృతదేహాన్ని బయటకు తీయించి, కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు నిజాంసాగర్ ఎస్ఐ. శివకుమార్ తెలిపారు.