వరంగల్: నెల రోజులుగా వృథా అవుతున్న తాగునీరు.. అధికారుల నిర్లక్ష్యం
వరంగల్ పోతననగర్ రోడ్డుపై నెల రోజులుగా తాగునీటి పైపులైన్ లీక్ అవుతోంది. వేల లీటర్ల నీరు వృథాగా మురుగు కాల్వలో కలుస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.