నంద్యాల అర్బన్: నంద్యాలలో దివ్యాంగుల సమస్యలపై ఎంపీ బైరెడ్డి శబరి కీ వినతి
Nandyal Urban, Nandyal | Apr 22, 2026
దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డీపీ మస్తాన్ వలి ఎంపీ బైరెడ్డి శబరిని కోరారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న మూడు చక్రాల స్కూటర్లు త్వరగా ఇప్పించాలని కోరారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.