ఒంగోలు అర్బన్: జగన్ ఆస్తుల విషయంలో పదహారేళ్లుగా కోర్టులో కేసులు ఉన్నాయి :
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
Ongole Urban, Prakasam | Jul 13, 2026
జగన్ ఆస్తుల విషయంలో పదహారేళ్లుగా కోర్టులో కేసులు ఉన్నాయి అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు.న్యాయవ్యవస్థ నిద్రపోతుందో లేక ఢిల్లీ రాజకీయ వత్తిలు ఉన్నాయో కేసుల విషయంలో ఏమీ తేల్చకపోవడం గమనార్హంఅని,తమిళనాడులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు న్యాయ స్థానాలు చేయాల్సిన పని చేశాయి అని , జగన్ విషయంలో పదహారేళ్లుగా న్యాయ స్థానాలు సైలెంట్ గా ఎందుకు ఉన్నాయి అన్నారు. జయలలితకి ఒక న్యాయం, జగన్ కి ఒక న్యాయమా... అని తమిళనాడు ప్రజలు అడుగుతున్నారు అన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి. అయోధ్యలో రామాలయం కట్టడం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ హర్షించారు.