జహీరాబాద్: జీర్లపల్లి మాజీ ఎంపిటిసి ని ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీటీసీ నీ ఎమ్మెల్యే మాణిక్ రావు పరామర్శించారు. జరా సంఘం మండలంలోని జీర్లపల్లి మాజీ ఎంపిటిసి తుల్జమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సాయంత్రం ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.