సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి : బిజెపి జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నరసాపుర్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్లో బాంబులు వేయడం చేతకాదు కానీ ఇక్కడ ప్రచారానికి వస్తున్నారని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి అడ్డదిడ్డంగా మాట్లాడడం తగదని హెచ్చరించారు. మతిస్థిమితం లేకుండా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.