రాప్తాడు: ఇటికలపల్లి వద్ద అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న జెఎన్టియు ప్రొఫెసర్ సత్యనారాయణ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నాలుగు గంటల సమయంలో నిర్వహించిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినిల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో జేఎన్టీయూ అకాడమీ ప్లానింగ్ ప్రొఫెసర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సత్యనారాయణ అనంతలక్ష్మి కళాశాల చైర్మన్ అనంత రాముడు తదితరులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో చేరే ప్రతి విద్యార్థిని ప్రణాళిక ప్రకారం చదువుకొని భవిష్యత్తులో స్టార్టప్ కంపెనీ కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని గాని విద్యార్థినిలు పొందాలని ప్రొఫెసర్ సత్యనారాయణ, అనంతలక్ష్మి చైర్మన్ అనంత రాముడు పిలుపునిచ్చారు.