సైదాపూర్: మండల కేంద్రంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూలిన ఇల్లు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయినట్లు పంచాయతీ కార్యదర్శి సారయ్య గురువారం తెలిపారు. ఐలాపురం శ్రీ మతి అనే మహిళకు చెందిన ఇంటికి చెందిన గోడ మరియు పైకప్పు భాగంలోని కొంతమేర కూలిపోయినట్లు తెలిపారు. కూలిన ఇల్లును పరిశీలించామని, నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల సాయికుమార్ తెలిపారు.