పామూరు పట్టణంలో ఎస్సై అనూక్ ఆటో మరియు ట్యాక్సీ డ్రైవర్లకు మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో మరియు టాక్సీలో ఎక్కించుకోవద్దని హెచ్చరించారు. అలా చేయడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం లేదా అంగవైకల్యం సంభవించడం జరుగుతుందన్నారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దని మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.