నంద్యాల అర్బన్: రైతు నగరంలో బాల్య వివాహాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం
Nandyal Urban, Nandyal | Apr 24, 2026
గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే 1098 నంబరు సమాచారం ఇవ్వాలని శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్ కోరారు. శుక్రవారం నంద్యాల మండలంరైతు నగరం గ్రామంలో పొదుపు మహిళలకు శక్తి యాప్, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ప్రతి మహిళా ఫోన్లో శక్తి యాప్ ఉండాలని ఆయన సూచించారు. వన్ స్టాప్ సెంటర్ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రఫీ, మహిళా పీసీ లక్ష్మీదేవి పాల్గొన్నారు.