సంతనూతలపాడు: రైతు సేవా కేంద్రాల్లో అందించే రాయితీ సెనగ, మినుము విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : సంతనూతలపాడు ఏఓ పావని
సంతనూతలపాడు మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో అందించే రాయితీ సెనగ మరియు మినుము విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సంతనూతలపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి పావని సూచించారు. సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ అధికారి పావని మాట్లాడుతూ... రాయితీ సెనగ, మినుము విత్తనాలు కావలసిన రైతులు వ్యవసాయ సహాయకుడిని సంప్రదించి వాటిని పొందాలని సూచించారు.