రాప్తాడు: పాపంపేటలో పరిటాల సునీత ప్రోత్బలంతోనే భూములు ఆక్రమిస్తున్నారు అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపణ
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం 12 గంటల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాపంపేటలో సర్వేనెంబర్ 106 లో 930 ఎకరాల సోత్రం భూములను వారసుల మేమే అని వెంకట కిరణ్ అనే వ్యక్తులు హైకోర్టు ద్వారా జిల్లా కలెక్టర్ డైరెక్షన్ ఇచ్చి వివాసము ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారని గతంలో ఈ ప్రయత్నాన్ని తన అడ్డుకోవడం జరిగిందని అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే పరిటాల సునీతవారికి సహకరిస్తున్నారని అందుకే అక్రమలు జరుగుతున్నాయని తోపుదుర్త ప్రకాష్ రెడ్డి ఆరోపణ చేశారు.