ఆత్మకూరు: ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మహిళా సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అవగాహన
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉద్దేశంతో మహిళా సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్ర జెండర్ స్పెషలిస్టులో శ్రీ వాణి సలోమి సుమలు ఆత్మకూరు మండలంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నిర్భయంగా ధైర్యంగా ఓటు వేయాలని ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దు అని కులమత బేధాలు వర్గ భేదాలు లేకుండా నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారుఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ వాస్తవ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు