అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్యాధికారులు ప్రియాంక, రిషికేష్ ల ఆధ్వర్యంలో పల్స్ పోలియో వ్యాక్సినేటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పెద్దన్న, ఎంపీడీవో లక్ష్మి నారాయణ, టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున, హెల్త్ సూపర్వైజర్ రమణ లతో కలసి ఏ ఎన్ ఎం లకు, ఎం ఎల్ హెచ్ పి లకు, అంగన్వాడి టీచర్స్ కు సమావేశాన్ని నిర్వహించి ఈనెల 21న నిర్వహించే పల్స్ పోలియో వ్యాక్సినేటర్ పై అవగాహన కల్పించారు.