కర్నూలు: “విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం” – జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్
“విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం” – జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు.కర్నూలు జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగింది. మొత్తం 81 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిపై త్వరితగతిన విచారణ జరిపి పరిష్కరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు.ఎస్పీ మాట్లాడుతూ – “ఉద్యోగాల పేరుతో ఎవ్వరూ మోసపోకండి. పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పే వారిని నమ్మకండి” అని ప్రజలకు సూచించారు.ప్రధాన ఫిర్యాదులు:ఉద్యోగం ఇప్పిస్తా