అదిలాబాద్ అర్బన్: ఇంద్రవెల్లిలో పేకాట స్థావరంపై దాడి: 14 మంది అరెస్ట్, రూ.2.24 లక్షల నగదు స్వాధీనం
ఇంద్రవెల్లిలోని పాడుబడిన మిట్టల్ జిన్నింగ్ ప్రాంగణంలో పేకాట ఆడుతున్న 14 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2,24,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.