ఉండ్రాజవరం మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న ఫ్లెక్సీల తొలగింపు ప్రక్రియ
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఉండ్రాజవరం మండలంలోని గ్రామాల్లో నాయకుల విగ్రహాలకు ముసుగులు, గ్రామాల్లో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు, గోడ పత్రికల తొలగింపు వంటి కార్యక్రమాలు ఆదివారం కూడా కొనసాగించారు. అధికారులు గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన వివిధ పార్టీలకు చెందిన భారీ ఫ్లెక్సీలు తొలగించేందుకు ఆయా అభ్యర్థులకు సమాచారం అందించినట్లు ఉండ్రాజవరం మండలం చివటం పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి తెలిపారు. వారికి ఇచ్చిన సమయంలో ఫ్లెక్సీలను తొలగించని ఎడల అధికారులే స్వచ్ఛందంగా ఫ్లెక్సీలు తొలగింపు చేపడతారన్నారు. ఈ సందర్భంగా చివటంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగులు వేశారు.