అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు: మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
మండపేటలో రెవెన్యూ విభాగం అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్సు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ఛైర్మన్ పతివాడ నూకదుర్గా రాణి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఎక్స్ అఫిషియో సభ్యు లుగా ఆయన పాల్గొని మాట్లాడారు.