వేములపల్లి: వేములపల్లి మాజీ ఉపసర్పంచ్ రోడ్డు ప్రమాదంలో మృతి, ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నల్గొండ జిల్లా, వేములపల్లి మాజీ ఉపసర్పంచ్ ఆమిరెడ్డి పద్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గురువారం మధ్యాహ్నం ఆమె పార్థివ దేహానికి పూలమాలని వేసి నివాళులర్పించి, జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాలి కాంతరెడ్డి తదితరులు ఉన్నారు.