పులివెందుల: వేంపల్లి లో కొబ్బరి చెట్టు నాటి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు
కడప జిల్లా వేంపల్లి పట్టణంలో కూటమి నాయకుల నిర్లక్ష్యం వల్ల గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించి ఆగిపోయిన రోడ్లు పనులు పూర్తి కావడంలేదని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి ఆరోపించారు. రోడ్డు పనులను కూటమి నాయకులు పూర్తి చేయడంలో విఫలం చెందిన నేపథ్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేంపల్లి లోని పులివెందుల రోడ్డులో కొబ్బరి చెట్టు నాటి నిరసన తెలిపారు. కూటమి నాయకులు ఆర్భాటంగా రోడ్డు పనులు ప్రారంభించేందుకు కొబ్బరికాయ కొట్టారని పనులు చేయడం మరిచారని చెప్పారు