ముమ్మిడివరం: శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో స్వామివారికి, అమ్మవారికి పవళింపు సేవ.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీలంక తెల్లమ్మ గుడి అమ్మవారి ఆలయ సమీపంలో గల శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో స్వామివారికి అమ్మవారికి పవళింపు సేవ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు భక్తిశ్రద్ధలతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అంగర విజయ రామాచార్యులు, అంగర లక్ష్మీనరసింహచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ స్వామి వారి పవళింపు సేవ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పంచహారతులు ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.