నంద్యాల అర్బన్: నంద్యాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను ఘోరంగా అవమానించారంటన్న ఎమ్మార్పీఎస్ నేతలు
Nandyal Urban, Nandyal | Apr 14, 2026
నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 155 వ జయంతి సందర్భంగా నూతన విగ్రహాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు అయితే నూతన విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకంలో అంబేద్కర్ పేరు చిన్నగా ఉండి మిగిలిన మినిస్టర్లు ఇతర ప్రజాప్రతినిధుల పేర్లు పెద్దగా ఉండడాన్ని ఎమ్మార్పీఎస్ నేతలు తప్పు పట్టారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించారంటూ మండిపడ్డారు