జహీరాబాద్: జహీరాబాద్ లో ఘనంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు జండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య విలువలు, నిరుద్యోగం, విద్య, వైద్యం , సామాజిక న్యాయం తదితర సమస్యలపై నిరంతర పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్ ,రాజేష్, దుర్గాప్రసాద్ ,తదితరులు ఉన్నారు.