జహీరాబాద్: గోపన్ పల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గోపన్పల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కాసిం పూర్ గ్రామానికి చెందిన తుకారాం అనే వ్యక్తి మంగళవారం రాత్రి గోపనపల్లి నుండి వస్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన స్థానికులు జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది.