అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలోని కాటా వెంకటప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1996 -2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి గురువులు రామకృష్ణ, త్యాగరాజు, శకుంతలమ్మ, ఆంజనేయులు ,నాగరత్నమ్మ, జక్రియ ,చంద్రశేఖర్ ,రమణ షెక్షావలి తదితరులకు పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పూల వర్షంతో స్వాగతించి దుశ్యాలువాలు పూల మాలలు,జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషమని తమ విద్యార్థులు ప్రస్తుతం వివిధ హోదాలలో ఉండటం అభినందనీయమన్నారు.