నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్న కురవని వర్షం
Nandyal Urban, Nandyal | Jul 1, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా జూన్ మాసం మొత్తం గడిచినా సరైన వర్షాలు లేవని, బోర్లు, బావులు, కుంటలకు నీరు అందలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకొర వర్షానికి పంటలు వేసినా ఆ తర్వాత వర్షాలు లేక ఎండిపోతున్నాయి ఆవేదన చెందుతున్నారు. నెల రోజులుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి కానీ పంటలకు సరిపడా వర్షాలు పడటం లేదని అంటున్నారు.