బనగానపల్లె: సాదు కొట్టం రహదారులు వాహనదారులకు ఇబ్బందులు
బనగానపల్లె మండలం సాదుకొట్టం గ్రామ రహదారిలో ప్రయాణం వాహనదారులకు పెను సవాలుగా మారింది. రోడ్డు నిర్మాణ పనుల కారణంగా ఒకే దారి నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పెద్ద వాహనాలు దారిలో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.