కార్తీక మాసం మొదటి సోమవారం రోజు శివ దీక్షను స్వీకరించి స్వామి అమ్మవారిని దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా
కార్తీక మాసం మొదటి సోమవారం రోజున శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శివ దీక్షను స్వీకరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మొదటగా ఆలయ ప్రాంగణంలో గురు స్వాములు శివదీక్ష మాలధారణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు,ఆలయ అర్చకులు మరియు ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే కార్తీక మాసంలో శివదీక్ష దారుణ చేస్తున్నాడు.