ముదిగుబ్బ: గ్రామ సచివాలయంలో సమయపాలన పాటించని ఉద్యోగులు-సీపీఐ
ముదిగుబ్బ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు అన్నారు.గురువారం పని నిమిత్తం సచివాలయానికి వెళ్లిన శ్రీనివాసలకు ఉద్యోగుల స్థానంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.సుదూర ప్రాంతాల నుండి రైతులు విద్యార్థులు పనుల నిమిత్తం సచివాలయానికి వస్తుంటారని ఉద్యోగులు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడమే కారణమన్నారు.