నందికోట్కూరు: పీరుసాహెబ్ పేట గ్రామంలో విఫలమైన ట్రాక్టర్ దొంగతనం నిందితులు పరార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఏకంగా ట్రాక్టర్ నే దొంగతనం చేయడానికి వచ్చిన నిందితులు వచ్చిన సంఘటన మిడుతూరు మండలం పీరుసాహెబ్ పేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన వల్లపురెడ్డి భరత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు భరత్ కుమార్ రెడ్డికి చెందిన ట్రాక్టర్ (ఏపి 04 బిజి 4059) ఇంటి ముందు ట్రాక్టర్ ను ఉంచారు. గురువారం తెల్లవారు జామున 3:45 నిమిషాలకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి దగ్గర ఉన్న ట్రాక్టర్ ను దొంగతనం చేయడానికి వచ్చారు.తాళం చెవి లేకుండానే ట్రాక్టర్ ను స్టార్ట్ చేసి ట్రాక్టర్ ను వెనక్కి తీసుకువెళ్లి ముందుకు వెళ్తుండగా ట్రాక్టర్ శబ్దం రావడంతో మిద్దెపై నిద్రిస్తున్న కుటుంబ