కావలి: అంధకారంలో బుడంగుంట ఇందిరమ్మ ఎస్సీ కాలనీ..
కావలి 17వ వార్డు బుడంగుంట ఇందిరమ్మ ఎస్సీ కాలనీలలో 480 ఇళ్లకు విద్యుత్ నిలిపివేశారు. బుధవారం సాయంత్రం సుమారు 60 మంది విద్యుత్ శాఖా సిబ్బంది ట్రాక్టర్లు, కార్లు, బైక్లో వచ్చి సర్వీస్ వైర్లు, మీటర్లు తొలగించారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ తొలగింపుపై భగ్గుమన్నారు. ఒక్కొక్కరికి రూ. 15 వేల నుంచి లక్షల రూపాయల విద్యుత్ బిల్లులు రావడంతో బెంబేలెత్తారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది.