చాగలమర్రి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు, పూర్వ విద్యార్థి ముల్లా షబ్బీర్ అహ్మద్ 30 లక్షలతో 30 సీసీ కెమెరాలు అందజేత
నంద్యాల జిల్లా చాగలమర్రి జెడ్పి బాలుర ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి ముల్లా షబ్బీర్ అహ్మద్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు, పాఠశాల భద్రత దృష్టిలో ఉంచుకొని మూడు లక్షల వ్యయంతో 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు, తాను చదివిన పాఠశాలకు సేవ చేయడం తనకు గర్వకారణం అని అన్నారు, ఇది తనకు ఎంతో ఆత్మ సంతృప్తి కలిగించిందని తెలిపారు, గతంలోనూ పాఠశాల ప్రహరీ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు