అదిలాబాద్ అర్బన్: విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.