బొమ్మలరామారం: మండల కేంద్రంలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్వహించిన మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని కోరారు. మల్లన్న స్వామి ఆలయానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.