అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కడదరకుంట లో అరటి తోటకు నిప్పు ఆరు లక్షల ఆస్తి నష్టం
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం కడదరకుంట గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు అరటి తోటకూ నిప్పు పెట్టడంతో రైతుకు ఆరు లక్షల మేర నష్టం వాటిలిందని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పొలంలో ఉన్న మూడువేల అరటి మొక్కలకు నిప్పు పెట్టడంతో అరటి పంట పూర్తిగా కాలి దగ్ధమైంది.